
ఆండ్రాలజీ అంటే ఏమిటి? ఇది గ్రీకు భాష నుంచి ఉత్పన్నం అయింది. గ్రీకు పదం ఆండ్రోస్ అనగా మనిషి అని అర్థం. ఇదే ఆండ్రాలజీ అనే పదానికి మూలం. పురుష పునరుత్పత్తి (మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్) సమస్యలను గురించి వివరించే ఔషధ రంగాన్ని ఆండ్రాలజీ అని అంటారు. ఇది పురుషులకు సంబంధించిన గైనకాలజీ అని గుర్తించవచ్చు. గైనకాలజీ అనేది చాలా రోజుల నుంచి ఉంది. కానీ ఆండ్రాలజీ అనేది ఇటీవలే బాగా డెవలప్ అవుతోంది. ఇటీవలి సంవత్సరాలలో ప్రొస్టేట్ మరియు పురుషుల పునరుత్పత్తి గురించి పెరుగుతున్న ఆందోళనల కారణంగా ఈ రంగం చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఆండ్రాలజిస్ట్‌లు పురుషుల పునరుత్పత్తికి సంబంధించిన సమస్యల మీద దృష్టి సారించే వైద్య నిపుణులు. ఆండ్రాలజీ అనేది యూరాలజీలో ఒక భాగం. ఇది అందులో ఒక సబ్ స్పెషాలిటీ. యూరాలజీ అనేది మగవారు మరియు ఆడవారికి సంబంధించిన మూత్రవ్యవస్థ సమస్యల మీద దృష్టి సారిస్తుంది.
ఆండ్రాలజిస్ట్ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన నిపుణుడైన వైద్యుడు. మీకు యుక్తవయస్సు వచ్చిన తర్వాత 3 నెలలకు ఒకసారి తరచూ అండ్రాలజిస్ట్ను సందర్శించాలి. అండ్రాలజిస్ట్ మీ పెల్విక్ (వెన్నుముక చివరి భాగం, పునరుత్పత్తి అవయవాలను కలిగి ఉంటుంది) ప్రాంతాన్ని మీరు ఏవైనా సమస్యలు కలిగి ఉన్నారా అని పరిశీలిస్తాడు. మీకు ఈ కింది సమస్యలు ఉంటే మీరు తప్పనిసరిగా ఆండ్రాలజిస్ట్‌ను సందర్శించాలి.
ఆండ్రాలజిస్ట్ మరియు యూరాలజిస్ట్ ఇద్దరూ మగవారిని పరీక్షిస్తారు. కానీ ఈ రెండు రంగాలు ఒకదాని నుంచి మరొకటి వేర్వేరుగా ఉంటాయి. యూరాలజీ అనేది మూత్రవ్యవస్థ మీద దృష్టి సారించి సమస్యలను తీర్చే ఒక శాఖ. ఆడవారికి లేదా మగవారికి జననేంద్రియ వ్యాధులు ఉంటే యూరాలజిస్ట్లు వాటిని నిర్ధారించి చికిత్స చేస్తారు. యూరాలజిస్ట్లు జననేంద్రియ మార్గాల్లో ఉన్న వ్యాధులను శస్త్రచికిత్స లేదా మందుల ద్వారా తగ్గించేందుకు చూస్తారు. యూరాలజిస్ట్లు తరచూ రోగులను సందర్శిస్తూ ఉంటారు. రోగుల వైద్య చరిత్రను రికార్డ్ చేసుకుని విశ్లేషిస్తారు. వాటి ఆధారంగా రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తారు. చికిత్స ప్రణాళికలను అభివృద్ధి చేస్తారు. ఇతర పనులతో పాటు వైద్యం కూడా చేస్తారు. యూరాలజిస్ట్ మగవారు ఇంకా ఆడవారిని కూడా పరీక్షించి చికిత్స అందజేస్తాడు. అండ్రాలజీ అనే వైద్య రంగం యూరాలజీలో భాగమే. ఇది పురుషుల పునరుత్పత్తి సమస్యల మీద మాత్రమే దృష్టి పెడుతుంది. పురుషులను తీవ్రంగా ప్రభావితం చేసే జెనిటో యూరినరీ (జననేంద్రియ అవయవాల వ్యవస్థ) సిస్టమ్ సమస్యలను తగ్గించేందుకు ఆండ్రాలజిస్ట్ కృషి చేస్తాడు. ఆండ్రాలజిస్ట్‌లు కూడా యూరాలజిస్ట్‌ల వంటి వారే. రోగుల వ్యాధులను తగ్గించేందుకు ఆపరేషన్ చేయొచ్చు. లేదా మందులతో చికిత్స చేయొచ్చు.
రోగాన్ని నిర్ధారించేందుకు మరియు చికిత్సను సూచించేందుకు అండ్రాలజిస్ట్ అనేక పరీక్షలను సిఫారసు చేస్తాడు. అందులో కొన్ని పరీక్షలు ఇక్కడ ఉన్నాయి.
స్పెర్మ్ (వీర్యం) యొక్క ఆకారం, పరిమాణం, నిర్మాణాన్ని అర్థం చేసుకునేందుకు ఈ పరీక్ష ఉపయోగించబడుతుంది. వంధ్యత్వానికి గల కారణాన్ని అంచనా వేయడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. ఈ పరీక్ష సాధారణంగా ఆండ్రాలజిస్ట్ చికిత్సా పద్ధతిని తెలిపే ముందు ఈ పరీక్ష నిర్వహిస్తారు.
మీ వీర్య నమూనాలో సాధారణం కంటే ఎక్కువగా తెల్ల రక్తకణాలు కనుక ఉంటే మీ ఆండ్రాలజిస్ట్ మీ వీర్య కల్చర్ (వీర్య నమూనా ప్రయోగశాల పరీక్ష) అభ్యర్థించవచ్చు. ఒక ల్యాబ్ విశ్లేషకుడు మీ వీర్యాన్ని కల్చర్ చేసి అందులో బ్యాక్టీరియా పెరుగుదలను చూస్తాడు. బ్యాక్టీరియా కనుక మీ వీర్యంలో ఉన్నట్లయితే అవి ఏ విధమైన బ్యాక్టీరియాలు.. ఎటువంటి యాంటీ బయాటిక్స్ వాటిని నాశనం చేస్తాయి.. అని గుర్తించేందుకు మీ వీర్యాన్ని వేరే ప్రయోగశాలకు పంపుతారు.
స్పెర్మ్ న్యూక్లియస్‌లో 40–60 శాతం వీర్యం హెడ్ లోపల ఆక్రోసమ్ క్యాప్ అని పిలువబడే ఒక నిర్మాణంతో కప్పబడి ఉంటుంది. ఆక్రోసమ్ అనేది పని చేయాలంటే మన వీర్యం అనేది అండం కవరింగ్లోకి విజయవంతంగా ప్రవేశించాలి. వీర్యం అనేది తప్పనిసరిగా బైండింగ్ సైట్ల నుంచి విడిపోతుంది. మరియు ఆక్రోసమ్ ప్రతిస్పందనను అనుసరించి అండంతో ఏకం అవుతుంది. కృతిమ స్టిములేషన్ (ఉద్ధీపన) కోసం ఆక్రోసోమ్లను ఆక్రోసోమ్ స్టిములైజేషన్ పరీక్ష ద్వారా కనుగొంటారు. ఇది డబుల్ డిటెక్షన్ టెక్నిక్‌ను ఉపయోగిస్తుంది.
మగ వారిలో టెస్టోస్టిరాన్ అని పిలువబడే ప్రత్యేకమైన హార్మోన్లు ఉంటాయి. ఈ హార్మోన్ సెమెన్ (వీర్యం) ఉత్పత్తికి మరియు సెక్సువల్ క్యారెక్టర్స్ (లైంగిక కోరికలు) కలిగిస్తుంటుంది. టెస్టోస్టిరాన్ తక్కువగా ఉత్పత్తి అయినా లేక ప్రొజెస్టిరాన్ ఎక్కువగా ఉత్పత్తి అయినా అవసరం లేని ప్రభావాలను మనలో కలుగుతాయి. ఇటువంటి సందర్భంలో ఆండ్రాలజిస్ట్ హార్మోన్ల స్థాయిని గుర్తించే రక్తపరీక్షలను సజెస్ట్ చేయొచ్చు. (సూచించవచ్చు)
ఆండ్రాలజిస్ట్ అంటే పురుష పునరుత్పత్తి వ్యవస్థలో అనుభవం కలిగిన వైద్యుడు. ప్రతి పురుషుడు తరచుగా చెకప్ చేయించుకోవడం కోసం ఆండ్రాలజీలో నిపుణుడైన వైద్యుడిని సంప్రదించాలని సిఫారసు చేయబడింది. ఆండ్రాలజిస్ట్ యూరాలజిస్ట్ నుంచి భిన్నంగా ఉంటాడు. యూరాలజిస్ట్ అంటే యూరినరీ సిస్టమ్ (మూత్రవ్యవస్థ) గురించి చెప్పే వైద్యుడు. మీ లక్షణాల ఆధారంగా ఒక ఆండ్రాలజిస్ట్ మీకు రోగ నిర్ధారణ పరీక్షలను సూచిస్తాడు. దాని ప్రకారం చికిత్సను ప్లాన్ చేస్తాడు. ఒక ఆండ్రాలజిస్ట్ మీ లైంగిక ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటాడు.
This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |